కాక్రోచ్ జనతా పార్టీ ఏపీలో జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంపై స్పందించింది. థింసా నృత్యాన్ని ప్రదర్శించి మోదీకి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి రిప్లై ఇస్తూ కాక్రోచ్ పార్టీ మరో పోస్టు చేసింది. ఈ కార్యక్రమం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నిర్వహిస్తున్నారా? అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.