గతంలో రఘురామపై నమోదైన రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో సాక్ష్యుల్ని రఘురామ బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు కోరుతూ రిటైర్డ్ ఐపీఎస్ పీవీ సునీల్ తాజాగా సీబీఐని ఆశ్రయించారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కు ఆయన ఓ లేఖ రాశారు. ఓ వార్తను ప్రస్తావిస్తూ మాదాల శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులో రఘురామ తనను అపహరించేందుకు ప్రయత్నించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని లేఖలో వివరించారు. ఈ ఘటన సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంగా ఉందని పేర్కొన్నారు.