విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రేపు (ఆగస్టు 1) దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్ట్ పనుల పురోగతిని ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయానికి ప్రతీక అయిన ‘థింసా’ నృత్యాన్ని ప్రారంభోత్సవ వేదికపై కళ్లుచెదిరే రీతిలో ప్రదర్శించాలని సూచించారు.