సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసులో కుమారుడిని రక్షించేందుకు ఆయన సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.