కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. 48 కిలోల మహిళల జూడో విభాగంలో అస్మిత దే స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ పోరులో కెనడాకు చెందిన హైడి క్వాచ్ను 2-1 తేడాతో ఆమె ఓడించింది. కామన్వెల్త్ గేమ్స్ భారత్ జూడోలో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు ఇది నాలుగో స్వర్ణ పతకం. దీంతో మొత్తం పతకాల సంఖ్య 18కి చేరింది.