ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణను హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టు ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.ఈ కేసు విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కోర్టు ఎదుట స్వయంగా హాజరయ్యారు.న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా కోర్టుకుహాజరై, ఒక్కొక్కరూ రూ. లక్ష చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు.