మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో పోలీసులు తాజాగా మిర్యాలగూడలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కృష్ణా రెడ్డి కనిపించకుండా పోయారని, కోర్టు ఆదేశాల తర్వాత తప్పించుకుని తిరుగుతున్నారని, పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అందుబాటులో లేరనే వార్తలు వెలువడ్డాయి. తాను ఎక్కడికీ పారిపోలేదని, తన తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ప్రకాశం జిల్లా స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వచ్చానని స్పష్టం చేశారు.