గబ్బర్ సింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యాక్టర్ రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. రమేశ్‌కు బెయిన్ స్ట్రోక్ రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రమేశ్ కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చాడు. తక్షణ వైద్య సహాయం కోసం రమేశ్ భార్యకు రూ.౩ లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ మేరకు రమేశ్ భార్యకు చిరంజీవి చెక్కు అందజేశారు.