ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక కీలక ప్రకటన చేస్తూ, గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక బేస్‌లకు కనీసం 500 మీటర్ల పరిధిలో సామాన్య ప్రజలెవరూ ఉండవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పుడైనా ఏక్షణంలోనైనా వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బలగాల కదలికలు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని కూడా స్థానిక ప్రజలకు ఐఆర్‌జీసీ పిలుపునిచ్చింది.