హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం (BA276) విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. విమానం 30వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక పైలట్ కు ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తింది.అలాగే విధులు నిర్వర్తించిన వారు.. చివరకు లండన్లోని హీత్రూలో విమానాన్ని దింపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. వారు ముగ్గురు హైదరాబాద్లోని ఒక హోటల్లో అల్పాహారం తిన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజినింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.