నాగాలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది.