<span;>మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గెమ్స్కు తెరలేవనుంది. గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా క్రీడల్లో పాల్గొనే భారత బృందాన్ని ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్), లొవ్లీనా బొర్గోహైన్(బాక్సింగ్)లు సారధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని శనివారం భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23న ఆరంభమయ్యే ఆరంభ వేడుకలో మీరాబాయి, లవ్లీనాలు 126 మందితో కూడిన భారత బృందానికి ముందునడుస్తూ పతకధారులుగా వ్యవహరించనున్నారని పేర్కొంది.