సోషల్ మీడియా చదువుపై ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిలిచింది నీట్ రీటెస్ట్ 2026లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్.వైష్ణవి దాస్ తన విజయం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాన్ని వెల్లడిస్తూ, తాను 11వ తరగతిలో ఉండగానే ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్ చేశానని తెలిపింది. “ఇన్స్టాగ్రామ్ వల్ల సమయం వృథా కావడం తప్ప ప్రత్యేకమైన లాభం ఏమీ లేదని గుర్తించాను. అందుకే దానిని పూర్తిగా దూరం పెట్టి చదువుపై దృష్టి పెట్టాను” అని ఆమె పేర్కొంది.