ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరిక నుంచి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అన్నాతో పాటు పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా కాలి నడకన కొండపైకి వచ్చారు. అనంతరం శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దగ్గరుండి అన్నాకు స్వామి వారి దర్శనం జరిపించారు. అన్నా లెజినోవా మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.