loader

అమరావతి రాజధానిలో జగన్నాథుడి రథయాత్రను సీఎం చంద్రబాబు ఇవాళ అట్టహాసంగా ప్రారంభించారు. రాజధానిలోని వెంకటపాలెం నుంచి రథయాత్రను సీఎం ప్రారంభించారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు చంద్రబాబు బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి స్వామివారి రథ యాత్రను తాడుతో లాగి ప్రారంభించారు. పూరీ రథ యాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ప్రతీ ఏటా జగన్నాథ రథ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ సంస్థ ప్రకటించిందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON