హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థికి ‘కల్మా’ను హోంవర్క్ ఇవ్వడంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో బరితెగించి బలవంతంగా విరుచుకుపడ్డారు. కొందరు బలుపెక్కి, హిందూ సంస్కృతిపై దాడులకు దిగుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులతో కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సమాజంలో ఉండే సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.