అయోధ్య విరాళాల చోరీపై నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు SMలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విరాళాల కుంభకోణం అనేది చాలా చిన్న దొంగతనమని, మొఘలుల కాలంలో మన దేవాలయాలను లూటీ చేసి, బ్రాహ్మణులను చంపి, దేశ సంపదనంతా దోచుకున్నదే నిజమైన దొంగతనమని ఆయన ఇటీవలే పేర్కొన్నారు. తనపై వస్తున్న విమర్శలపై అనుపమ్ ఖేర్ మరోసారి స్పందిస్తూ మెడలో కాషాయ కండువా ధరించి షేర్ చేసిన ఒక వీడియోలో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.