పల్నాడు జిల్లా విఠంరాజుపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. నక్కా భారతి, పాల వ్యాన్ డ్రైవర్ సునీల్ రెడ్డి దంపతులకు తేజేష్ రెడ్డి (6),హేమనాథ(4) ఇద్దరు కుమారులు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీల్ రెడ్డి సోమవారం రాత్రి విధులకు వెళ్లిన తర్వాత భారతి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపింది. అనంతం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.