జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ పనులు, నూతన రహదారుల మంజూరుపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి.. రీజినల్ రింగ్ రోడ్డు పనులను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తాము భావిస్తోన్నామని, దీనికి సహకరించాలని చెప్పారు. అలాగే పలు ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.