రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలోనామినేషన్ వేశారు. పీకే ప్రకటించిన లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ వంద కోట్లు దాటింది. ఆయనకు 105 కోట్ల రూపాయల ఆస్తులు, 5.78 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇందులో చరాస్తుల విలువే 22.20 కోట్లుగా చూపించారు. అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్ డాక్టర్, సీనియర్ అడ్వైజర్ ఆయన భార్య జాహ్నవి దాస్ పేరు మీదే 112 కోట్ల ఆస్తులు ఉన్నాయి.