“కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, ముఖ్యమంత్రి రక్త దాహం తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు తక్షణమే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. రక్తం అడిగారు కదా.. ఇదిగో తీసుకో అంటూ బ్లడ్ ప్యాకెట్లతో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు.