బనకచర్ల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని, అలాగే ఆయా పనులపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలనె పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం కేసులో ప్రాథమిక విచారణ పూర్తి కాకుండా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, అందులో సాంకేతిక లోపాలు ఉన్నట్లు, పిటిషన్‌లోని సాంకేతిక లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.