తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కొట్టంపట్టీ ప్రాంతం వందినగర్ బస్టాప్ వద్ద రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రయాణికుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ప్రైవేటు బస్సు మార్తాండం వెళ్తుండగా ఆర్ టిసి బస్సు తిరూచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.