రష్యాతో తీవ్రమైన యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్ మహిళా ప్రధానమంత్రి యులియా స్విరిడెన్కో తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆయన సూచనల మేరకు యులియా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం కొత్త బాధ్యతల్లో సేవలు అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. దేశాన్ని పటిష్టం చేయడానికి సరికొత్త రాజకీయ వ్యూహాలు అవసరమని అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు.