తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు, కృష్ణ బేసిన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా, తాగునీటి, సాగునీటికి పెను గండంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జలాశయంలో 513 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టుకు
సంబంధించిన డెడ్ స్టోరేజ్ 510 అడుగులు అంటే మరో మూడు అడుగుల నీరు కిందికి వెళితే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిని వాడుకోవడానికి వీలుండదు.