వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 80 మంది తెలుగు వారు ఉన్నట్లు సమాచారం. 18 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక వియత్నాం అధికారులు గాలింపు, సహాయక చర్యలను ముమ్మరం చేశారు.