భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయంగా అతి పిన్న వయస్సులో 300 మ్యాచులు ఆడిన బ్యాటర్ నిలిచింది. 29ఏళ్ల స్మృతి ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తం 10వేలకు పైగా పరుగులు చేసింది. ఇందులో 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున 2013లో స్మృతి మంధాన అరంగేట్రం చేసింది.