రాష్ట్రంలో కరవు తాండవిస్తోంది. వానాకాలంలో కీలకమైన జూన్ మాసాంతం ఒక్క భారీ వర్షం కూడా కురవకుండా, గాలి చినుకులతోనే గడిచిపోయింది. జులైలో సగటు కన్నా 15 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం,9 జిల్లాల్లో లోటు వర్షపాతమే కురిసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జులై 9 నాటికి 185.4 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 156.7 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది.