టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ కరూర్ జిల్లా పర్యనటలో భద్రతా లోపం చోటుచేసుకుంది. కరూర్‌లోకి ప్రవేశిస్తుండగా భారీ భద్రతను దాటుకుని ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు. సీఎం వాహనం వద్దకు చేరుకునే లోపే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. సీఎం విజయ్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి సహాయం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది.