కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్య పేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేశ్, ఎరుపల్లి ప్రసాద్ అనే ఇద్దరు మత్స్యకారులు(జాలర్లు) తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందితో కలిసి సముద్రం లో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేటకు వీరు వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు బోటులో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి, పడవ మొత్తానికి వ్యాప్తి చెందాయి.వేరే బోటులో ఉన్న తోటి జాలర్లు వారిని రక్షించారు.