దేశంలో అమలువుతున్న ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానంపై వస్తున్న విమర్శలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఈ పాలసీ వల్ల తనకు ఎటువంటి వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలు లేవని చెప్పారు. ఇథనాల్ ఇంధనం వాడటం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయనే విమర్శలకు తగిన ఆధారాలు చూపాలని ఆయన సవాల్ విసిరారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ, కేంద్ర క్యాబినెట్ మరియు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే ఈ ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.