మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ప్రయాణికుల రైలును నిలిపివేసి.. లోకో పైలట్ సమోసాలు కొన్న వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. వీడియోలో వైరల్ అవుతున్న రైలు రౌ యార్డులో షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్, నిర్వహణ పనులు జరుగుతున్నందున.. ఆ రైలును ఇందౌర్ సమీపంలోని రౌ హోమ్ సిగ్నల్ వద్ద అప్పటికే నిలిపివేసినట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతించిన చోటే రైలు ఆగిందని పేర్కొంది. అసిస్టెంట్ లోకో పైలట్.. దుకాణానికి వెళ్లి సమోసాలు కొనడానికి రైలు దిగారని తెలిపింది.