పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. నిరంజన్ అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని, భవిష్యత్తులో వారికి ఏ అవసరం వచ్చినా సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సోనూసూద్ హృదయపూర్వకమైన హామీ ఇచ్చారు.