ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై మునుపెన్నడూ లేనంతగా నిప్పులు చెరిగారు. నీటిపారుదల శాఖ నివేదికలు, ఆధారాలను ప్రస్తావిస్తూ.. కాళేశ్వరం పేరుతో చారిత్రాత్మక విధ్వంసానికి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే ప్రత్యక్ష బాధ్యులని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఆర్థిక ఉగ్రవాదులు అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 11,670 కోట్లు ఖర్చు చేశాక.. కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్ ఆలోచనలు మార్చారని ధ్వజమెత్తారు