రాష్ట్రంలో 2 లక్షల మందికిపైగా కళాకారులున్నారు. గ్లోబల్ మార్కెట్ కు అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకొస్తాం. డబ్బు సంపాదనే కాదు..పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలి. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి.. ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.