టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎంఎస్ ధోని 45వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని అంబారుపేట గ్రామంలో ధోని అభిమానులు ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ కటౌట్‌ను ప్రతిష్ఠించడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.