మణిపుర్ లో అనుమానిత మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉబ్రూల్ జిల్లాలో సైనికుల కాన్వాయ్ పై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒకరు వారెంట్ ఆఫీసర్ కాగా.. మరొకరు డ్రైవర్ గా గుర్తించారు. జవాన్లు అస్సాం రైఫిల్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తిరిగివెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.