వివాదాస్పద ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై వాట్సాప్ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసులపై స్పందించి, వివరణ ఇచ్చేందుకు కేంద్రం అదనపు సమయాన్ని ఇచ్చింది. మూడు రోజుల పాటు అదనపు సమయాన్ని కేటాయించింది. గత శుక్రవారం నాటికి కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే, అదే రోజు వాట్సాప్ మాతృసంస్థ మెటా నుంచి ఓ బృందం ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులను కలిసింది. అయితే, చర్చలు పూర్తయ్యే వరకూ భారత్‌లో ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టొద్దని తేల్చి చెప్పారు.