తల్లికి అనారోగ్యం కారణంగా స్వగ్రామంలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి(32) హత్యకు గురైంది. ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్‌బాబుతో పరిచయం కాస్తా స్నేహమై, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే, ప్రియుడు శ్యామ్‌బాబుకు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆలస్యంగా తెలుసుకుంది. తాను మోసపోయానని గ్రహించి, అప్పటినుంచి శ్యాం బాబును పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు. తెల్లవారుజామున నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.