నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. క్రిమినల్ కోర్టులోని మూడో అంతస్తులో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తులో మంటలు చెలరేగి వ్యాపిస్తుండటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.