విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. ఒడిశా తీరంలో ఏపీ మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. ఇంజిన్ లోపంతో సముద్రంలో బోటు నిలిచిపోయిందని గల్లంతైన మత్స్యకారులు వీడియో రిలీజ్ చేశారు. వీడియోపై అప్రమత్తమైన ఏపీ అధికారులు.. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.