సుదీర్ఘ విరామం అనంతరం లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్ అక్కినేని, ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, మొహం చూపించలేకపోయానని అన్నారు. లెనిన్ చిత్రం తనను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందని, తనను “ఇంట్లో వాడిని” చేసుకునేలా చేయాలని కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్” అని ఆయన అన్నారు.