చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనితీరు ఉందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. హేరామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్విటర్ వేదిక ద్వారా చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారని దుయ్యబట్టారు.