కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు కలబురిగి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించోలి బయలుదేరిన బస్సు చివరి సర్వీసు సమయంలో రాత్రి వేళ హెడ్లైట్స్ పని చేయలేదు. బస్సు నడిపేందుకు డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో కండక్టర్ తన మొబైల్ ఫోన్లోని టార్చ్ వెలుగులో రోడ్డు మార్గాన్ని చూపించాడు. దీంతో ఆ డ్రైవర్ బస్సు నడిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటక ఆర్టీసీ బస్సుల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి.