కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా వీరా హోటల్ సమీపంలో కాన్వాయ్‌లోని 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ రాజుకు కారు తగలడంతో ఆయన కిందపడి గాయపడ్డారు. ఎమ్మెల్సీ రాజును అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.