సినిమాను కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘లూమియర్ మ్యూజియం’లో జక్కన్న పేరు ఇకపై చిరస్థాయిగా నిలిచిపోనుంది! మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో లాంటి వరల్డ్ క్లాస్ లెజెండరీ డైరెక్టర్ల నేమ్ బోర్డులు ఉండే ప్రతిష్ఠాత్మక ‘మ్యూర్ డే సినియాస్ట్’.. అంటే ఫిల్మ్ మేకర్స్ వాల్ ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన “ఎస్ ఎస్ రాజమౌళి” అనే పేరు సగర్వంగా మెరిసిపోయింది! ఈ చారిత్రక క్షణాన్ని చూసి రాజమౌళి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.