జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 2028 జూలై 3న ఈ స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులను ప్రారంభించేందుకు మరోసారి ఇక్కడికి వస్తానని ప్రకటించారు. రాయలసీమను ఇకపై “రాళ్ల సీమ”గా కాకుండా “రతనాల సీమ”గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు కృషి చేశారో ప్రజలు గుర్తించాలని సూచించిన సీఎం, అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుతో అక్కడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.