కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారికంగా శ్రీకారం చుట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించిన సీఎం, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

