అరేబియా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అమెరికా నౌకాదళానికి చెందిన MH-60S సీ హాక్ హెలికాప్టర్.. అత్యవసరంగా నీటిపై దిగుతుండగా కులిపోయినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. జూలై 1న తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిందని US నౌకాదళం తెలిపింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉన్నారని, వారిలో ముగ్గురిని గాయాలతో రక్షించామని, ఒకరు గల్లంతయ్యారని నౌకాదళం తెలిపింది.