యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్న (బుధవారం) రాత్రి ఓ కేసులో బెయిల్‌పై విడుదలైన వెంటనే, మరో కేసులో భాగంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. తనను ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పనని, యూట్యూబ్‌లో తన అరెస్టుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తానని తెలిపినట్లు సమాచారం. ఈరోజు (గురువారం) సాయంత్రం రావణ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.